కశింకోట, ఫిబ్రవరి 9 (ప్రభ న్యూస్): ఎలాంటి వివక్ష లేకుండా అర్హతే ప్రామాణికంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కశింకోట గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను బుల్లిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని వివరించారు. జాతిపిత గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన మార్పును ప్రస్తుతం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారని చెప్పారు.
పరిపాలనా సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ మన్ననలు అందుకుంటోందన్నారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలుతీరు అమోఘమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో పల్లె పల్లెల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు మౌలిక వసతులు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామంలో 700 మీటర్లు రోడ్లు, డ్రైనేజీ పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బొబ్బరి వీధిలో పనులు చేపడుతున్నామన్నారు. కొంతమంది మహిళలు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు అడగటంతో తక్షణమే వాలంటీర్లను పిలిపించి వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.