Friday, November 22, 2024

మంకీపాక్స్‌ కలకలం..

విశాఖలో ఓ వైద్య విద్యార్థిని మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు క‌ల‌క‌లం రేపింది. దీంతో వైద్యాశాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. నగరంలోని ప్రైవేట్‌ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ కొన్ని రోజులుగా వ్యాధి లక్షణాలతో చికిత్సపొందుతున్నారు. ఆమె శరీరం, వేళ్లపై దద్దుర్లు కనిపించడంతో వైద్య కళాశాల అధికారులు జిల్లా వైద్యులకు సమాచారం అందించారు. దీంతో విషయాన్ని విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఆదేశాల మేరకు అప్రమత్తమైన వైద్యాధికారులు వైద్య కళాశాలకు ర్యాపిడ్ రెస్పాన్స్‌ టీంను పంపారు. ఇవాళ ఆ వైద్య విద్యార్థిని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement