విశాఖపట్నం, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తు న్నారని,ఇదే సమయం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వం తీసుకుని పోరాటం సాగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. విశాఖలో ఇక్కడి పౌర గ్రంధాలయంలో రైటర్స్ అకా డమీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చర్చాగొష్టి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఆ అవినీతి కార ణంగానే కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నా రని ప్రచారం జరుగుతోందన్నారు. భారీ మోజార్టీతో అధికారంలోకి వచ్చిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు భయపడాలి అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనకడుగు వేస్తే.. అది మీ తప్పుగానే జనం భావిస్తా రని, ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలు మీ వెంట నిలబడతారని జైల్‌కు పంపిస్తారని భయపడ వద్దుని, జైలు జీవితం మీకు ఏమి కొత్తకాదుని… ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాల మాటలు వింటా రో, రాష్ట్ర ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తారో అన్న ది తెల్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజ లంతా కేంద్ర ప్రభుత్వంపై పోరాడ తారనే అనుకుంటున్నారని, భయ పడటం వైఎస్‌ఆర్ కొడుకు చేయాల్సి నది కాదని,విశాఖలో స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యేక సదస్సులు నిర్వహించి వాటి ద్వారా ‘వైజాగ్ డిక్లరేషన్’ ఇద్దాం అంటూ ఉండవల్లి పిలుపునిచ్చారు. 51శాతం ఓట్లు, 151 సీట్లు సాధించిన ఘనత ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ లేదనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఈ ప్రైవేటీ-కరణ విషయంలో ఏవైపు ఉన్నది అనే ఈ విషయాన్ని స్పష్టం చేయాలని, నిరసనలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజావ్యతిరేకతను చూపాలని అరుణ్ కుమార్ అన్నారు.అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్‌ను రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి వట్టి వసంత కుమార్, ఆర్టీఐ మాజీ చైర్మన్ శ్రీధర్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement