విశాఖపట్నంలోని ఏఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో అపశృతి చోటుచేసుకుంది. వైజాగ్‌కు చెందిన శ్రవణ్‌కుమార్ అనే అభ్యర్థి మృతి చెందారు. 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న శ్రవణ్ కుమార్… రేసులో చివరి లైన్ కు చేరుకునే క్రమంలో స్పృహతప్పి పడిపోయాడు.
వెంటనే పోలీసులు శ్రవణ్‌కుమార్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రవణ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీస్ కావాలనుకున్న కొడుకు పుట్టిన రోజే చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.