Tuesday, October 22, 2024

AP | ఇక ట్రాఫిక్ రూల్స్ క‌ఠిన‌త‌రం..

విశాఖలో సెప్టెంబర్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయి.. ద్విచక్ర వాహనం నడుపుతున్న వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని విశాఖ పోలీసులు స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1035 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు.

హెల్మెట్ విక్రయించే వ్యాపారులు కూడా బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్లను మాత్రమే విక్రయించాలని… బీఐఎస్ గుర్తు లేకుండా హెల్మెట్‌లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే నంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడపవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement