Friday, November 22, 2024

విమ్స్ లో కోవ్యాగ్జిన్ డ్రాప్స్ మూడో దశ ట్రైల్స్ ప్రారంభం

కోవ్యాగ్జిన్ ముక్కు ద్వారా తీసుకుని నాసల్ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ మూడో దశ ట్రై ను రాష్ట్రంలో విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నాసల్ ఇంట్రామస్కులర్ వాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఈ పరిశోధనకు ఇప్పటికే 39మంది వాలంటీర్లు ముందుకు రావడం జరిగిందన్నారు. తొలిరోజు నలుగురు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. మొదటి రెండు ట్రైల్స్ లో మెరుగైన ఫలితాలను సాధించిందని ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అధిక మొత్తంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవటంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. డ్రాప్స్ ద్వారా వ్యాక్సిన్ తీసుకోవటానికి ఎవరి సహాయం అవసరం ఉండదన్నారు. ఈ ట్రైల్స్ ను ఐదు నెలల్లోపు పూర్తి చేసి నివేదికను అందజేస్తామన్నారు. ఈ ట్రైల్స్ కు ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ కె.రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్ విజయ్ కుమార్, సభ్యులుగా డాక్టర్ ఊర్మిలా, డాక్టర్ సఫీనా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement