Saturday, November 23, 2024

మన్యంలో ఆంత్రాక్స్​, దొరగూడలో ఏడుగురికి లక్షణాలు.. బాధితులంతా చిన్నారులే

పాడేరు, (అల్లూరి జిల్లా) ప్రభన్యూస్‌: విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గిరిజనులకు ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు కన్పిస్తూండటంతో భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో సుమా రుగా 15 కుటుంబాలు 70 మంది జీవిస్తున్నారు. వీరిలో సుమారుగా ఏడుగురికి ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. బాధితులంతా చిన్నారులే. వ్యాధి లక్షణాలు బయటపడి వారం రోజులైనా నేటికి నిర్ధారణ కాకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆంత్రాక్స్‌ వ్యాధి బయటకు వచ్చినప్పుడు పెద్దవాళ్ళలో మాత్రమే లక్షణాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న వెంటనే వైద్యబృందం గ్రామంలో పర్యటించింది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఏడుగురు రోగులకు చికిత్స చేస్తున్నారు.

మేకమాంసం తినడంవల్లే…

వైద్యులు దొరరూచ గిరిజనుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామంలో ఇటీ-వల చనిపోయిన మేక మాంసాన్ని భుజించటం వల్లే సోకినట్లు వైద్యలు నిర్ధారణకు వచ్చారు. వద్యులు ఆంత్రాక్స్‌ బారిన పడి చనిపోయిన మేక మాంసాన్ని తిన్నవారికి ఆంత్రాక్స్‌ వ్యాధి సోకుతుందని తెలిపారు. గతంలో ముంచంగిపుట్టు, అరకు, హుకుంపేట మండల పరిధిలో ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు బయట పడ్డా యి. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌ నుంచి వైద్య బృందాలను రప్పించి, ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలతో బాధపడే రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఈ ఏడాది దొరగూడలో ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు కనిపించాయి.

ఆంత్రాక్స్‌ నిర్ధారణ పరికరాల కొరత..

ఆంత్రాక్స్‌ వ్యాధి నిర్ధారణకు వ్యాధి లక్షణాలు ఉన్న రోగి నుంచి రక్తం, చీము సేకరించేందుకు అవసరమైన పరికరాలు ఆసుపత్రుల్లో అందుబాటులోకి లేవు. దొరగూడలో పర్యటించిన వైద్య బృందం ప్రస్తుత సాధారణ వ్యాధులను గుర్తిం చేందుకు వినియోగిస్తున్న పరికరాలతోనే రక్త నమూనాలను సేకరించి, విశాఖప ట్నంలోని కింగ్‌జార్జ్‌ ఆసుపత్రికి పంపించారు. రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలు పనికిరావని విశాఖ కేజీహెచ్‌ వైద్యులు నుంచి అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఆంత్రాక్స్‌ రోగుల నుంచి సేకరించే రక్త నమూనాలు కొరకు పరికరాలు గ్వాలియర్‌ నుంచి రావాల్సి వుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆంత్రాక్స్‌ బాధితుల్లో కురుపులు (పుండ్లు) నుంచి రక్త నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకమైన పరికరాలు అవసరం. నమూనాలు సేకరణకు ప్రత్యేక వైద్య నిపుణులు ఉండాలని అధికా రులు అంటున్నారు. నిర్ధారణ పరీక్షలకు అలస్యమైతే వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, పరిసర గ్రామాలలోమరికొంతమంది వ్యాధి ప్రబలే అవకాశాలు అధికంగా ఉంటుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement