విశాఖపట్నం : నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆదిత్య ఫోర్ట్యూన్ ఫ్లాట్ నెంబర్ 505 అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను సుంకర బంగారు నాయుడు..( 50 ) డాక్టర్ నిర్మల ( 44 ) దీపక్ ( 22 ) కశ్యప్ ( 19 )లుగా గుర్తించారు. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యచేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement