Friday, November 22, 2024

కరోనాతో మాజీ ఎంపీ స‌బ్బంహ‌రి క‌న్నుమూత‌

విశాఖ‌ప‌ట్నం: మాజీ ఎంపీ స‌బ్బంహరి క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 68 సంవ‌త్స‌రాలు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి నేటి మధ్యాహ్నం మరణించారు. ఈ నెల 15న సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అప్పటికీ కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి అరిలోవ అపోలో హాస్పటల్లో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే అయన మరణించారు.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘం కాలం ఉన్న ఆయన విశాఖ మేయర్ గా, ఎంపిగా సేవలందించారు. గత కొంత కాలంగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

సబ్బంహరి ప్రస్థానం
1౼06౼1952 న విశాఖ తగరపువలస చిట్టివలసలో సబ్బం హరి జన్మించారు.. బంగారునాయుడు, అచ్చియ్యమ్మకు ఆరవ సంతానం. సొంతూరు లోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఇంటర్‌ ఏవీఎన కళాశాలలో చేరారు.అక్కడే డిగ్రీ పూర్తిచేశారు..సబ్బం హరికి భార్య.. కుమారుడు,ఇద్దరు కుమార్తెలు.. ఇక రాజకీయాల విషయానికొస్తే 1995లో విశాఖ మేయర్‌ గా ఎన్నికయ్యారు.. అనంతరం 2009 లో 15వ లోక్ సభకు విశాఖ జిల్లా లోని అనకాపల్లి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.. గత సాధారణ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ సీనియర్ పార్టీ నేతగా బాద్యతలు నిర్వహిస్తున్నారు.. రెండు వారాలు గా కోవిడ్ తో బాధ పడుతూ 03౼05౼2021 లో మధ్యాహ్నం 1.57 నిమిషాలకు కరోనా తో చికిత్స పొందుతూ అపోలో హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement