Tuesday, January 14, 2025

AP | విశాఖ నుంచి త్వరలోనే అంతర్జాతీయ కార్గో సేవలు

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి త్వ‌ర‌లో అంతర్జాతీయ కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ) ఒప్పందం చేసుకోగా, రెండేళ్లపాటు కార్గో నిర్వహణ చేపట్టేందుకు ఏపీటీపీసీ ఆఫర్ ఇచ్చింది.

కార్గో తనిఖీ నుండి లోడింగ్, అన్‌లోడింగ్ వరకు అన్ని ఖర్చులను APTC భరిస్తుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నుంచి అనుమతి పొందిన తర్వాత మూడు వారాల్లో సేవలు ప్రారంభమవుతాయి. విశాఖ పారిశ్రామికాభివృద్ధిలో కీలక ముందడుగు ప‌డ‌టం పట్ల పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement