విశాఖపట్నం: నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో టిడిపి జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.. విశాఖ చేరుకున్న వెంటనే ఆయన సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు.. గాజువాక లో రోడ్ షో నిర్వహించారు.. అనంతరం స్టీల్ ప్లాంట్ వద్ద నిరశన దీక్షలు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు. నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తున్నాం అంటున్నారని, మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసి ఎందుకు అమ్మేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.. గల్లీ,నుండి ఢిల్లీ వరకూ రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి పోరాటానికి టిడిపి సిద్ధమని ప్రకటించారు. విశాఖ ఉక్కు విస్తరణ కోసం ఖర్చు చేసిన వ్యయం వలనే నష్టాలు కనిపిస్తున్నాయని, మూడు,నాలుగేళ్లలో పోతే మళ్ళీ లాభాల్లోకి రావడం ఖాయమని అన్నారు.. ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థ గా కొనసాగిస్తాం అని ప్రకటించే వరకూ మా పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.. విశాఖ ఉక్కు పరిరక్షణకు రేపటి బంద్ కి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు..అంతకు ముందు గాజువాక, తదితర ప్రాంతాలలో రోడ్ షో నిర్వహించిన లోకేష్ మాట్లాడుతూ, పెంచుతూ పోతామన్న జగన్ … సిమెంట్, ఇసుక, కరెంట్ ధర, పెట్రోలు నూనె ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఇంటి డోర్ ముందుకు రేషన్ సరుకులు అని నమ్మించి, బండి డోర్ తెరిస్తేనే సరుకులు ఇస్తున్నారని మండిపడ్డారు. విశాఖవాసులకు ఆదివారం వస్తే భయం వేస్తోందని ఏ ఇంటి గోడకూలుస్తారో అనే భయం అని అన్నారు. రోడ్లకు గుంతలే పూడ్చలేదు కానీ రాజధాని ఎలాతెస్తారంట అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కోసం పోరాటాలు చేసే దుస్ధితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోగా ఉక్కు కర్మాగారాన్ని కోల్పోయే దుస్ధితి వచ్చిందన్నారు. పది వాగ్దానాలతో ముందుకు వచ్చామన్నారు. ఇంటి పన్నులు సగం చేస్తామని తెలిపారు. నీటి పన్ను విపరీతంగా పెంచారని ,టీడీపీ వస్తే నీటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏ2 వచ్చాకే భూదందాలు పెరిగాయని, అక్రమాలు పెరిగాయని లోకేష్ ఆరోపించారు. గతంలో టిడిపి చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement