Friday, November 22, 2024

ఎన్ ఎ డి వంతెన‌ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్ …

విశాఖ‌ప‌ట్నం ఎన్ ఎ డి వంతెన నిర్మాణ ప‌నుల‌ను వియంఆర్డిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కోటేశ్వరరావు నేడు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న నిర్మాణ సిబ్బందితో మాట్లాడుతూ, దిగువ రోటరీ సుందరీకరణ పనులలో భాగంగా కాంక్రీట్ నిర్మాణ పనులకు అలంకరణ మరియు కళాత్మక కుడ్య చిత్రాలను వేయించడం ద్వారా పైవంతెనను అత్యంత ఆకర్షణీయంగా తీర్చి దిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణకు గ్లో-సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత పార్కింగ్ . పచ్చదనం పెంపునకు నిర్దేశించిన స్థలాలను పరిశీలించి పలు మార్పులు, చేర్పులు సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎగువ రోటరీ , దిగువ రోటరీల పైకి అనుమతించబడే వాహనాలను వేరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. తదుపరి శొంఠ్యాం గ్రామం నందు వియంఆర్డిఏ చేపట్టిన రహదారుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో ప్రధాన ఇంజనీర్ రామ్మోహన్ రావు, కార్యనిర్వాహక ఇంజనీర్ ఉమా మహేశ్వర రావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ తాతాజీ, సహాయ ఇంజనీర్ శ్రీనివాస్, రైట్స్ ప్రతినిధులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement