Tuesday, November 26, 2024

విశాఖ రాజధాని అంశంపై టీడీపీ వైఖరి చెప్పాలి: మంత్రి అవంతి

ఏపీ రాజధాని విషయంలో అందరిలోనూ గందరగోళం నెలకొంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో వర్కింగ్ క్యాపిటల్‌గా విశాఖను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి రాజధాని విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రాజధానిగా కేవలం అమరావతినే ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ రాజధాని అంశంపై ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేశారు. రాజధానిగా విశాఖపై టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిగా విశాఖను వ్యతిరేకించడానికి కారణాలేంటనేది వివరణ ఇవ్వాలని, విశాఖ ప్రజల ఓట్లు, సీట్లు కావాలి గానీ, రాజధానిగా విశాఖపట్నం వద్దా అని ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి చెందితే టీడీపీ ఆటలు సాగవు కాబట్టే రాజధానిగా విశాఖను వద్దనుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఈ వార్త కూడా చదవండి: ‘ఈనాడు’కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement