ఓ చేప దాడి చేయడంతో వ్యక్తి మృతిచెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. విశాఖ తీరంలో ఇటీవల చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు పై చేప దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్స్య కారులు చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు వలను బయటకు తీసే సమయంలో జోగన్న అనే మత్స్యకారుడిని చేప తన కొమ్ముతో పొడించింది. దీంతో జోగన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
వల బయటకు లాగేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాకపోవడంతో మత్స్య కారుడు జోగన్న పడవ దిగి వలను తీయాలని ప్రయత్నించారు. ఈ సమయంలోనే పెద్ద చేప జోగన్నపై దాడికి దిగింది. చేప తన కొమ్ముతో జోగన్న పై దాడి చేయడంతో మరణించాడు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..