Monday, November 18, 2024

రింగువలల సమస్యకు పరిష్కరం చూపుతాం: హామీ ఇచ్చిన విజయసాయి

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌): మత్సకారుల మధ్య నెలకొన్న రింగువలల సమస్యకు త్వరలోనే ఆమోదయోగ్యమైన పరిష్కారం తొందరలోనే లభిస్తుందని, ఇప్పటికే ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని వి. విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సీతమ్మధారలోని విజయసాయి రెడ్డి కార్యాలయంలో విశాఖనగరం, భీమిలి తదితర ప్రాంతాల నుండి సుమారు 20 గ్రామాలకు చెందిన మత్సకారులు, మత్స్యకార నాయకులతో ఈ విషయమై చర్చించారు.

ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జివిఎంసి కార్పొరేటర్ల బై ఎలక్షన్‌ ముగిసిన వెంటనే కమిటీ-వేసి మత్స్యకారులందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొని, ఇటు- సాంప్రదాయ వలలు వినియోగిస్తున్న మత్స్యకారులకు, అటు- రింగువలలు ఉపయోగిస్తున్న మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీనీ ఏర్పాటు చేయనున్నట్లు తులిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కమిటీ- ఏర్పాటు- చేస్తామని సాంప్రదాయ వలల మత్స్యకారులు, రింగువలల మత్స్యకారులు, ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకొని, అందిరికీ న్యాయం జ‌రిగేలా నిర్ణయం తీసుకుందామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement