Thursday, November 21, 2024

ఇప్ప‌టికైనా పరీక్ష‌లు వాయిదా వేయండి – కె ఎ పాల్…

విశాఖ‌ప‌ట్నం – హైకోర్టు సూచ‌న మేర‌కు వెంట‌నే టెన్త్, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని ప్ర‌ముఖ సువార్త ప్ర‌చార‌కుడు కె ఎ పాల్ ఎపి ప్ర‌భుత్వాన్ని కోరారు.. ప‌రీక్ష‌ల వాయిదా వేయాల‌ని కోరుతూ విశాఖ‌లో గ‌త రెండు రోజులుగా కె ఎ పాల్ నిర‌వ‌ధిక దీక్ష చేస్తున్నారు.. అలాగే వెంట‌నే ప‌రీక్ష‌లను వాయిదా వేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు.. నేడు ఆ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిగింది.. ఈ నేప‌థ్యంలో దీక్షా శిబిరంలో పాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎపిలో బుర్ర లేని వ్య‌క్తి విద్యా మంత్రిగా కొన‌సాగుతుండ‌టం వ‌ల్లే క‌రోనా స‌మ‌యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని మండి ప‌డ్డారు.. కరోనా సెకండ్ వేవ్ విల‌యతాండవం చేస్తున్న స‌మ‌యంలో మీ పిల్ల‌ల‌ను ప‌రీక్ష‌లకు పంపుతారా అంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను సూటిగా ప్ర‌శ్నించారు.. ఎపిలో ఉన్న వారంతా మీ బిడ్డ‌ల స‌మానులే క‌దా… మ‌రి వారి జీవితాల‌ను ఎందుకు ప్ర‌మాదంలో ప‌డేస్తున్నారంటూ జ‌గ‌న్ ను నిల‌దీశారు… హైకోర్టు లో విచార‌ణ మే మూడో తేది వ‌ర‌కు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు త‌న దీక్ష‌ను కొన‌సాగిస్తాన‌ని తేల్చి చెప్పారు.. ఈ లోగా ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తే నిర‌న‌న నిలిపివేస్తాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement