విశాఖపట్నం – విద్యార్ధులను మంచి వ్యక్తులుగాను, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా తయారు చేయడమే విద్య ముఖ్య లక్ష్యమని భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తి ఎన్.వి.రమణ అన్నారు. అయితే వీటి విష యంలో కొంత విఫలం అవుతున్నామని,ఈ లోపాన్ని సరిచేసుకుంటూ, విద్యావ్యవస్థలో మార్పులు తీసు కురావల్సిన అవసరం వుందన్నారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం 4, 5, 6, 7వ స్నాతకోత్సవం కోవిడ్ కారణంగా వర్చ్యువల్ (ఆన్ లైన్) ద్వారా జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన న్యాయమూర్తి ఎన్.వి.రమణ మాట్లాడుతూ నేటి తరం విద్యార్ధులకు తమ ప్రావీణ్య త పెంచుకోడానికి, మెరుగైన విద్యకోసం అనేక అవకాశాలు సాంకేతిక పరంగా వున్నాయని అన్నారు. వీటిని అంది పుచ్చుకొని ఎదగడానికి ప్రయత్నిస్తే ఆకాశమే హద్దని అన్నారు. స్నాతకోత్సవం అనేది విద్యార్ధులకే కాదు అధ్యాపకులకు, విశ్వవిద్యాలయా నికి ఎంతో ముఖ్యమని, విద్యార్ధులను భావితరాల నిర్మాతలుగా, సమాజానకి ఉపయోగపడేలా తీర్చి దిద్దే బాధ్యత ఆచార్యులది, విశ్వవిద్యాలయాలకు ముఖ్య లక్ష్యంగా వుండాలని అన్నారు. సమాజంలో మార్పు తెచ్చే ఇంజనీర్లుగా తయారవ్వాలంటే వారిలో సామాజిక స్పృహ, బాధ్యత సమాజానికి ఉపయోగపడాలనే తపన విద్యార్ధుల్లో వుండాలని అన్నారు. న్యాయ విద్యార్ధికి చెప్పే విషయంలో స్పష్టత, క్లుప్తంగా, మంచి భాషా పరిజ్ఞానం వుండా లని, వీటితో పాటు కఠినమైన పరిస్థితుల్లో కూడా పనిచేసేందుకు సిద్ధంగా వుండాలని సూచించారు. ఈ వర్చ్యువల్ స్నాతకోత్సవాన్ని అధికారికంగా ప్రారం భించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి డిగ్రీలను ప్రకటించారు. 2 ఎల్.ఎల్.డి, 4 పి.హెచ్.డి డిగ్రీలు, 28 ఎల్.ఎల్.ఎం. డిగ్రీలు, 418 ఎల్.ఎల్.బి డిగ్రీలను ఈ స్నాతకోత్సవంలో ప్రకటిం చారు. స్నాతకోత్సవం ప్రారంభంలో విశ్వవిద్యా లయ ఉపకులపతి ఆచార్య ఎస్. సూర్యప్రకాష్ వార్షిక నివేదికతో ప్రారంభించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement