Thursday, November 21, 2024

విశాఖ వైపు వ‌డి వ‌డిగా అడుగులు..

ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అడుగులన్నీ అటువైపే
సభలు, సదస్సులూ అక్కడే
వందేభారత్‌ రైలూ అక్కడికే
ఇవన్నీ కొత్త రాజధానికి సంకేతాలు
విశాఖ కేంద్రంగా పరిపాలనకు చకచకా ఏర్పాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: ఇవ్వాల్టి వరకూ అమరావతి కేంద్రంగా జరుగుతున్న పరిపాలనను తెలుగు సంవత్సరాది ఉగాది నుండి విశాఖ కేంద్రంగా సాగించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నా రు. ఇప్పటికే మూడు రాజధానులే తమ విధానమని స్పష్టంచేస్తూ వస్తున్న ఆయన ఈసారి మరో అడుగు ముందుకేసి దానిని ఆచరణలో చూపేందుకు సిద్ధమౌతున్నారు. అందుకే విశాఖే రాజధాని అని ప్రజల్లో భావన కల్పించేందుకు అక్కడే వరుసగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమా లను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మొన్న ప్రధాని మోడీతో వేల కోట్ల అభివృద్ధి పనులకు అక్కడ నుండే శంకుస్థాపన చేయించారు. నెల రోజుల వ్యవధిలోనే ఇప్పుడు అక్కడే అంతర్జాతీయ ఇన్‌వెస్టర్స్‌ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. అది అయిన వెంటనే జీ 20 దేశాల సదస్సుకు సన్నాహక సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్న వందే భారత్‌ రైలు కూడా విశాఖ వరకూ ఉండేలా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒప్పించారని తెలుస్తోంది. ఇలా ఇకపై ప్రభుత్వ పరంగా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్న ఆయన పరిపాలనా రాజధాని విశాఖే అని ప్రజల మనసులో ముద్రపడేలా చేసుకుంటూ వస్తున్నారు. ఇది రాజకీ యంగా కూడా ఆయన పైచేయి సాధించినట్లవుతుందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

అధికారులకూ స్పష్టమైన సంకేతాలు
విశాఖ కేంద్రంగా పరిపాలన నిర్ణయంపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించినట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రభుత్వ పరంగా చేపట్టబోయే వివిధ కార్యక్రమాలు అక్కడ నుండే ప్రారంభమయ్యేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా విశాఖలో జరగబోయే రెండు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతోపాటు వచ్చేవారికి విశాఖే రాజధాని అనే భావన కలుగచేసేవిధంగా ఉండాలన్నది సీఎం జగన్‌ సంకేతంగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే అధికారులు కూడా రూట్‌ మ్యాప్‌ ఫిక్స్‌ చేస్తున్నారు.

తీర్పు అనుకూలమే అన్న ధీమాతో
ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెలాఖరున తీర్పు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తీర్పు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి పాలన చేయటానికి ఎటు-వంటి అడ్డంకులు ఉండవు. దీంతో.. ముందుగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారం భించి.. ఉగాది నాడు అక్కడ నుంచి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించినట్లు- విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుల గురించి రివ్యూ నిర్వహించారు. అధికారులకు సూచనలు చేసారు. అదే సమయంలో విశాఖ కేంద్రంగా పాలనపైఅధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు- తెలుస్తోంది. ఇది నిజమేన్నట్లు ఇప్పటికే మంత్రులు విశాఖ నుంచి పాలన గురించి పదే పదే చెబుతూ వస్తున్నారు.

- Advertisement -

రాజకీయంగా పై చేయి సాధించేలా
విశాఖలో పాలన ప్రారంభించటం ద్వారా చెప్పిన విధంగా ఉత్తరాంధ్రలో పాలనా రాజధాని ప్రారంభించినట్లవుతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే.. ప్రతిపక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మూడు రాజధానులకు న్యాయ పరంగా అనుమతి సాధ్యం కాదనేది ప్రతిపక్షాల ధీమా. సీఎం జగన్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలించే అవకాశాన్ని ఈ విషయంలో సద్వినియోగం చేసుకొని ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ విశాఖ నుంచి పాలనపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త ఏడాది.. పాలన కొత్తగా
ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలు అమరావతిలో జరగను న్నాయి. అప్పటిలోగా సుప్రీంకోర్టులో తీర్పుపైస్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో మార్చి నెలాఖరు నుంచి పాలన ప్రారంభించేం దుకు ఇప్పటికే ఏర్పాట్లు- జరుగుతున్నాయి. ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభం తరువాత సీఎం అక్కడ నుంచే సమీక్షలు.. మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. మంత్రులు కూడా విశాఖలోనే క్యాంపు కార్యాలయాలు సిద్దం చేసుకోనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సచివాలయం కూడా విశాఖ నుంచి కొనసాగే అవకాశం ఉంది. సచివాలయం తరలింపు అంశం సు ప్రీం తీర్పుకు అనుగుణంగా నిర్ణయించనున్నారు. అయితే, మం త్రులు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పాలన ప్రారంభం అవుతుందని మంత్రులు పదే పదే చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement