బంద్కు వైకాపా, తెదేపా మద్దతు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు
అధికారపార్టీ స్వప్రయోజనాలకు రైతులు బలవుతున్నారంటూ తెదేపా
రైతు శ్రేయస్సే పరమావధిగా ఏర్పాటైన పార్టీ వారి లక్ష్య సాధనకు తోడంటూ వైకాపా
26న మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సుల నిలిపివేతకు ప్రభుత్వ నిర్ణయం
వేసవిలో కాక రేపుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం
విశాఖపట్నం : మండు వేసవి లో విశాఖ ఉక్కు కాక సెగలు రే పుతోంది. ఉక్కు సాధనలో అధికార, విపక్షాలు ఎవరి కివారే పైచేయి సాధించేందుకు పోటీ పడు తున్నాయి. విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరిం చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పై పోరాటాలచేసి ప్రజల మనసును గెలుచుకునేందు కు అటు వైకాపా, ఇటు తెదేపా పోటాపోటీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 26న రైతు సంఘాల పిలుపు మేరకు నిర్వహించబోతున్న భారత్ బంద్కు వైకాపా, తెదేపా పోటాపోటీగా మద్దతు ప్రకటించాయి. వైకాపా తరపున సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 26న రైతులు జరపతలపెట్టిన భారత్ బంద్కు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరోజు మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తామని వెల్లడించారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పాటైన వైకాపా ఆ రైతుల సమస్యల సాధికారతకోసం ఎనలేని కృషిచేస్తోందని, అందులో భాగంగా సాగు చట్టాలకోసం రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెం నాయుడు కూడా ఈనెల 26న రైతు సంఘాలు తలపెట్టిన బంద్కు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో అధికార వైకాపాపై నిప్పులు చెరిగారు. రైతుల పంట పొలాల్లోని బోరు బావులకు మీటర్లు పెట్టి వారి స్వప్రయోజనాలకు రైతులను బలిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీ-డీపీ ఏనాడూ వెనుకంజ వేయదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం రైతులను బలి చేస్తోందని ధ్వజమెత్తారు. మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.