విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన ఉప ఆలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజ స్థంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్థంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే సీసీ టీవీ పుటేజీ సహాయంతో ఈ ఘటన కారణాలపై పరిశీలించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని అధికారులు నిర్ధారించారు.
కాగా అతి పురాతనమైన ఈ ధ్వజస్థంభం లోపలి భాగంలోని కర్ర పుచ్చి పోవడంతో అకస్మాత్తుగా కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో జరిగినట్లు.. సీసీ టీవీ పుటేజీ పరిశీలన అనంతరం అధికారులు తెలిపారు. అనంతరం వేద మంత్రాలు, సంప్రోక్షణ తర్వాత తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్థంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. 10 రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు.
ఈ వార్త కూడా చదవండి: రాబోయే 5 రోజుల పాటు వర్షాలు