Friday, November 22, 2024

వైద్యవృత్తి ఎంతో గొప్ప‌ది – తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై

విశాఖపట్నం, ‌: కరోనా విపత్కర కాలంలో ముందుండి పోరాటం చేస్తున్న యోధులకు దేశం యావత్తు సలాం చేసిందని, వైద్యులు, నర్సులు, పారిశుద్ద్య కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందిం చారని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై ప్రశంసించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌-గైనకాలజీ అండ్‌ అబ్‌స్టెట్రిక్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(యువ ఫోగ్స్‌2020) దక్షిణ ప్రాంతీయ సమాఖ్య పేరిట వైజాగ్‌ కన్వెన్షన్‌లో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే సమాఖ్య యువవైద్యసమ్మేళనం తొలిరోజు కార్యక్రమాన్ని గౌరవ అతిథులుగా హాజరైన ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి. సుధాకర్‌ ప్రారంభించారు. తర్వాత గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వైద్యులను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆమె మాట్లాడారు. సర్జికల్‌గైనకాలజీ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాధా,డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, పద్మనాధ్‌ గోపాల్‌, వీరిని కలవడానికి ఆనందంగా ఉందన్నారు.వైద్యరంగంలో పురాతనమైన ఈ సొసైటీ దేశవ్యాప్తంగా విశేష సేవలందిస్తూ దక్షిణ భారత దేశంలో అత్యధికమైన సేవలతో విస్తరించిన ఈ సొసైటీలో తమను భాగస్వాములను చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉంది. గైనకాలజీ ఫెడరేషన్‌ కోవిడ్‌-19లో కూడా విశిష్టమైన సేవలందించినందుకు వైద్యులను అభినందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సొసైటీకి సేవలు అందిస్తున్నారు. కరోనా నియంత్రణకు భారత వైద్యశాస్త్రవేత్తలు ఎంతో కీలకపాత్ర పోషించారని, వారు తయారు చేసిన కరోనా వ్యాక్సన్లు భారత దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 17దేశాలకు పైగా కరోనా వ్యాక్సిన్‌ అందించడం అభినందనీయమన్నారు. వైద్యశాస్త్రంలో స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని గర్భాశయం, అండకోశాలు మొదలైన భాగాలకు సంబంధించిన చికిత్స విధానం ఎంతో ప్రాముఖ్యమైం దన్నారు. ఈ వైద్యవిధానానికి చెందిన నిపుణులను గైనకాలజీస్టులుగా వ్యవహరిస్తున్నారన్నారు. సమాజంలో స్త్రీల వైద్యం చేసేవారి చాలా మంది ఆధునిక గైనకాలజిస్టులు గర్భానికి సంబంధించిన నిపుణులగా పేరుగాంచడం విశేషమన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా అభి వృద్ధి చెందుతున్న మహానగరం వైజాగ్‌ స్మార్ట్‌ సిటీలో ఈ తరహా వైద్య సమ్మేళనం నిర్వహించడం ఎంతో సంతోషమన్నారు. కాలం మారేకొద్ది వైద్యం ఒక ఉదాత్తమైన వృత్తిగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సమాజంలో విశిష్టమైన స్థానాన్ని అలకరించిన వైద్యరంగంలో రాణిం చాలనే ఆసక్తి ఉన్న వారికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఉత్తమమైన, ఉన్నతమైన వైద్యరంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. ఈ వృత్తి ఇతర రంగ వృత్తులకు భిన్నమైనంది. డాక్టర్‌గా కేరీర్‌ ప్రారం భించినవారు రోగులకు సేవ చేయడం ద్వారా ప్రజా సేవలో పాల్గొన్న సంతృప్తిని పొందవచ్చు న్నారు. ఆర్ధికంగా, కూడా అభృవ్ధి చెందవచ్చు. ప్రజల్లో మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల కారణంగానే కరోనా సవాలును ఎదరిం చి..జీవితంలో తర్వాత దశలో సేవ చేసేందుకు వైద్యులు కృషి చేశార న్నారు. సమర్ధత, అంకిత భావం కలిగిన యువ వైద్యులు కరోనా సమ యంలో ఫ్రెంట్‌ వారియర్స్‌గా నిలబడి విశిష్ట సేవలు అందించా రన్నారు. అనంతరం యువ ఫొగ్స్‌ సొసైటీ నివేదికను గవర్నర్‌ ఆవిష్కరించారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి మాట్లాడుతూ కరోనా మహ మ్మారి పోరులో ముం దు వరుసలో ఉండి పోరాడిన వైద్య,ఆరోగ్య సిబ్బంది సేవలను మరువ రానివని, వైద్యవృత్తి అనేది అన్నింటి కన్నా గొప్పదని వైద్యులను కొని యాడారు. నగరంలో ఉన్న ఆంధ్రమెడికల్‌ కాలేజీ ఎంతో ఉన్నతమైన వైద్యులకు శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరేలా శిక్షణ ఇస్తున్న ఏఎంసీ ప్రొఫెసర్లను కొనియాడారు. వైద్య వృత్తి అనేది ప్రత్యేకమైన వృత్తి న్నారు. కరోనా సమయంలో బాధితులను పరీక్షిస్తున్నప్పుడు మానవ త్వంతో వ్యవహరించిన తీరు ప్రశంసనీ యమన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగనమ్మోహన్‌ రెడ్డి ప్రజా వైద్యానికి ఎంతో ప్రాము ఖ్యత ఇస్తున్నారన్నారు. ఆయన తండ్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టి పేదలకు ఉన్నతమైన వైద్యాన్ని అందించిన ఘనత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. అదే రీతిలో ఆయన తనయుడు సీఎం జగన్‌ పేదలకు వైద్య సేవలు విస్తరిం చడానికి రాష్ట్రంలో 16 వైద్య కళాశాలు ఏర్పాటు చేశారని, ప్రతి వెయ్యి మందికి ఉన్నతమైన వైద్యసేవలు అందించడానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను విస్తరించి మెరుగైన వైద్యాన్ని అందించడం అభినందనీయ మన్నారు. వృత్తి నైపుణ్యత గలిగిన వైద్యవృత్తి..ఎప్పటికీ డిమాండేనని పేర్కొన్నారు. యువ ఫొగ్స్‌ సమ్మేళనంలో గైనకాలజిస్ట్‌లు, ప్రసూతి వైద్యులు, దీర్ఘకాలిక ఆడ లైంగికత సమస్యలు,పైబ్రాయిడ్లు, ఫిస్టులాస్‌, జనరల్‌ ఫిజికల్స్‌, ఇమ్యూనైజేషన్‌ వైద్యులు, అండాశయ తిత్తులు, ఫీడా యాట్రిక్‌, కౌమర గైనాకలాజీ, లైంగిక సంక్రమణ వ్యాధుల చికిత్సలు అందించే వివిధ శాఖలకు సంబంధించిన వైద్యనిపుణులు తమ అభిప్రాయాలను వివరించారు. అనంతరం ఫొగ్సి అధ్యక్షుడు డాక్టర్‌ అల్పాష్‌ గాంథీ,ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జదీప్‌ తనక్‌ ఫొగ్సి ఎలెక్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌. శాంత్‌కుమారి కలసి గౌరవ అతిథిగా హజరైన ఎంపీ సత్యవతిని సొసైటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement