Thursday, November 21, 2024

AP | విజ్ఞానంతో చేసే పండగ దీపావళి… బ్రహ్మకుమారి రామేశ్వరి

విశాఖపట్నం : విజ్ఞానంతో చేసే పండగ దీపావళి అని, జీవితంలో అంధకారం తొలగించే దీపావళి కార్తీక మాసం ఆరంభ శుభ సూచకమని బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి తెలియజేశారు. బుధవారం డాబా గార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్ల‌బ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోని స్థానిక సేవా కేంద్రాలన్నింటి సారథ్యంలో జర్నలిస్టులందరికీ దీపావళి శుభాకాంక్షలు బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి తెలిపారు.

దీపావళి పండుగ ఆధ్యాత్మిక రహస్యాన్ని సందేశపూర్వకంగా ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వ‌రి మాట్లాడుతూ… విజ్ఞానంతో చేసే పండగ దీపావళి అన్నారు. జీవితంలో అంధకారం తొలగించేదే దీపావళి, సత్యం తెలిస్తేనే నిర్భయంగా ఉండొచ్చునన్నారు. మనిషిలో గల దుర్గుణాలు పోగొట్టేదే దీపావళి అన్నారు. నరక చతుర్దశి అంటే మనిషిలో ఉండే నరకం అన్నారు. మంచి గుణాలు వుంటే మనిషీ దేవుడు అన్నారు. బాణసంచా కాల్చడం వల్ల జర్నలిస్టుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపాలని కోరారు.

సింహాచలంలో రాజయోగ ధ్యానం కేంద్రం, ఆస్పత్రి స్థాపన కోసం ప్రభుత్వ స్థలం కేటాయింపు కోసం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. ప్రజలకు విజ్ఞానం పెంచేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జ‌ర్న‌లిస్టు గంట్ల శ్రీనుబాబు, వీజేఎఫ్ మాజీ అధ్య‌క్షుడు నాగరాజు పట్నాయక్, సంఘమిత్ర సంస్థ సూరిబాబు, బ్రహ్మ కుమారీస్ సంస్థ సభ్యులు సిద్దు, సునీత, సత్యవతి, రష్మిక పాల్గొన్నారు. అంతకు ముందు విధి విలాసం పత్రిక ఎడిటర్ చింతా ప్రభాకర్ మృతికి సంతాప సూచకంగా జర్న లిస్టులు మౌనం పాటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement