Tuesday, November 26, 2024

విశాఖ‌లో సిబిఆర్ఎస్ సెంట‌ర్..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: ప్రపంచ స్ధాయి నగరంగా, హెల్త్‌సిటీ, పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ రానున్నది. దేశంలోనే పది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వ హణ సమయంలో రోగులకు మెరుగైన వైద్యసే వలందించాలనే ఉద్దేశంతో సెకండరీ లెవల్‌ కెమికల్‌, బయో లాజికల్‌, రేడియాలాజికల్‌ అండ్‌ న్యూక్లియర్‌(సిబీఆర్‌ఎన్‌) మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. దీనిలో భాగంగానే ఏపీలోని విశాఖ జిల్లా విమ్స్‌ ఆసుపత్రిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశాఖలో ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రానికి అవసరమైన స్థలం, వసతులు, తదితర వాటిపై పూర్తిస్ధాయి ప్రతిపాదనలు కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి త్వశాఖ అధికారులు కొరగా, వారు కోరిన ప్రతిపాదనల జాబితా మేరకు ఏఏ వసతులు కావాలి అనే అంశాలను పేర్కొంటూ, విమ్స్‌ అధికారులు ఆయా పూర్తిస్ధాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ముఖ్యంగా ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే అధిక సంఖ్యలో ఫార్మా కంపెనీలు, స్టీల్‌ప్లాంట్‌, ఇతర కార్మాగారాలు ఉండటంతో ఇక్కడ జరిగే ప్రమాదాలు, విపత్తుల కు సంబంధించి జరిగే ప్రమాదాల్లో బాధిత రోగులకు, క్షతగాత్రులకు ఈ నూతన సెంటర్‌ ఏర్పాటు ద్వారా సకాలంలో మెరుగైన వైద్యసేవలందించే అవకాశ ముంది.

అయితే ఈ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యత, నిర్మాణాలు, ఉద్యోగ నియామకాలు, వసతుల కల్పన తదితర అంశాలన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో ఈ కేంద్రం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయించారు. త్వరలోనే ప్రతిపాదనలు పూర్తిస్ధాయిలో పరిశీలన అనంతరం కేంద్ర కమిటీ అధికారుల బృందం పర్యటించి, వాస్తవాలను స్వయంగా పరిశీలించిన తర్వాత ఆత్యాధునిక వసతులతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయనున్నారని విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. రాంబాబు తెలిపారు. విశాఖతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల పరిశ్రమల ఉండటంతో వాటిలో ప్రమాదాలు జరిగేటప్పుడు క్షతగా త్రులకు ఈ సెంటర్‌ ద్వారా అత్యున్నత వైద్యసేవలు అం దించడం జరుగుతుందన్నారు. అదే విధంగా కరోనా వైరస్‌ లాంటి బయోలాజికల్‌ పరిస్థితులు ఏర్పడినప్పుడు వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించే వీలు కలుగుతుందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖకే అవకాశం
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో పది ప్రాంతాల్లో ఈ నూతన సిబీఆర్‌ఎన్‌ సెంటర్లుఏర్పాటు చేయనుంది. దీనిలో భాగంగానే గుజరాత్‌, జార్కాండ్‌, అసోం, రాజస్ధాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లిd, ఒడిశా, కర్నాటక ప్రాంతాలు కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క విశాఖకే ఇంతటి అవ కాశం కల్పించారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న మెడి కల్‌ కళాశాలలు, జిల్లా ఆసుపత్రులకు వచ్చే రోగులకు సైతం ఈ కేంద్రం ద్వారా మెరుగైన వై ద్యసేవలందించనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సెంటరల్‌ సర్వీస్‌ స్కీమ్‌లో భాగంగా హెల్త్‌ డిజాస్టర్‌ ప్రెపేర్‌నెస్‌ అండ్‌ రెస్పాన్స్‌) విభాగం ద్వారా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిత్వశాఖ అధికారులు ఆయా రాష్ట్రాలకు చెందిన వైద్యశాఖ ఉన్నతా ధికారులు, సెంటర్లు ఏర్పాటు చేసే అధికారులతో ప్రత్యేకంగా వీడియోకాన్పరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా న్యూక్లియర్‌ విభాగానికి సం బంధించి కూడా భవానాన్ని ఏర్పాటు చేయనున్నారు. విశాఖ విమ్స్‌ కేంద్రంగా ఈ సెంటర్‌ ఏర్పాటు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరం.
విమ్స్‌లో సేవలు మరింత విస్తృతం
ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విశాఖ విమ్స్‌కు వచ్చి వైద్యసేవలు పొందు తున్నారు. తాజా గా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ నున్న సిబిఆర్‌ఎన్‌ సెంటర్‌తో మరింత మెరుగైన సేవలం దనున్నాయి. విశాఖ లో ఫార్మా కంపెనీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అధికంగా ఉన్న నేపధ్యంలో తరుచూ జరిగే విపత్తుల ప్రమాదాల నేప థ్యంలో ఈ కేంద్రం అందు బాటులోకి వస్తే రోగులకు మెరుగైన సేవలందుతాయి. ఇప్పటికే పూర్తిస్ధాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం. అక్కడ ఆమోదముద్ర లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

  • డాక్టర్‌ కె.రాంబాబ, విశాఖ విమ్స్‌ డైరెక్టర్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement