Thursday, November 21, 2024

వైద్యం కోసం బాలింతల అవస్థలు.. 5 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం

ఆదివాసి బాలింత.. ఐదు కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం. రెండు కిలోమీటర్లు నవ శిశువు (పాప)ను చేత్తో మోసుకుంటూ నడక ప్రయాణం – వైద్యం కోసం బాలింత అవస్థలు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పిత్రి గడ్డ గ్రామం ఎత్తైన కొండల మధ్య 14 కుటుంబాలు 80 మంది జనాభా ఆదివాసి కోందు తెగ ఆదివాసి గిరిజనలు జీవనం సాగిస్తున్నారు. కొర్ర రూతు(20) సంవత్సరాలు గర్భవతి. 9 నెలలు నిండిన తర్వాత నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతూ.. రాత్రి 8 గంటల సమయంలో ఫ్రీగా డెలివరీ అయింది. పాప జన్మించింది. ఆసుపత్రికి తీసుకురావాలంటే చిమ్మ చీకట్లో అడవిలో తీసుకొని రాలేకపోయి ఉదయం ఏడు గంటల సమయంలో భర్త అయిన కొర్రలక్ష్మణరావు తన కుటుంబ సభ్యులు రెండు బైకుల సహాయంతో బాలింతను ఆర్ల గ్రామం నుండి బైక్ పై తీసుకెళ్లి ఆర్ల గ్రామంలో నుండి ఆటోలో బుచ్చoపేట PHCలో జాయిన్ చేయడం జరిగింది.

పిత్రి గడ్డ గ్రామంలో 25 మంది పిల్లలు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రం లేదు.. కమ్యూనిటీ హెల్త్ వర్గం లేరు. ఈ గ్రామంలోని గర్భిణీ స్త్రీలు అందరు కూడా గ్రామంలోనే డెలివరీ అవుతుంటారు. రోడ్డు సౌకర్యం లేక 2020 సంవత్సరంలో దగ్గర్లో ఉన్న జాజులు బంద.. పిత్రి గడ్డ గ్రామస్తులు సహితంగా ప్రతి ఇంటికి 3000 రూపాయల చొప్పున చందాలు వేసుకొని రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. బైకు అతి కష్టం మీద ప్రయాణించే అవకాశం ఉంది. విశాఖ పరిపాలన రాజధానిగా కాబోతున్నది.. అభివృద్ధి ఫలాలు తమకు అందరం లేదు.. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు అడవి మధ్యలో రాళ్లు రప్పల మధ్య అడవి తల్లి వడిలో పురుడు పోసుకున్న పరిస్థితి మా ఆదివాసి బిడ్డలకు నేటికీ దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుంది. మా బిడ్డలకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో రేషన్ కార్డులలో లేరు. జగనన్న నవరత్నాలు పథకాలు అందాలంటే.. రేషన్ కార్డులో పేర్లు ఉండాలి. కానీ నేటికీ కూడా మా పిల్లలకి లేవు. స్కూల్లో జాయినింగ్ చేయాలంటే రేషన్ కార్డులో పేర్లు ఉండాలి. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా రోడ్డు కోసం ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు అనకాపల్లి వారికి అనేక సార్లు ఫిర్యాదు చేసినం. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి. బుచ్చింపేట పిఏసి పరిధిలో బర్త్ డే వెయిటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఉగాది నాటికి రోడ్డు సౌకర్యం, అంగన్వాడి సెంటర్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ని నియమించకపోతే కొండ శిఖర గ్రామస్తులందరినీ కలుపుకొని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు డోలుయాత్ర ద్వారా తమ నిరసన తెలియజేస్తామని పిటిజి సంక్షేమ సంఘం తెలుపుతోంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు k గోవిందరావు, గిరిజన సంఘ మండల కార్యదర్శి కొర్ర కృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement