విశాఖ: అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో తేల్చుకోండి అని విశాఖ ఓటర్లను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు..జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, వైసీపీ కి ఓట్లు వేస్తే రౌడీయిజానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని అన్నారు. రౌడీలు, గూండాలు, నేరస్తులు పెట్రేగిపోతారని, దాడులకు తెగబడతారని.. అలాంటప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి నాటకాయలరాయుడని, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని, ప్రశాం తమైన విశాఖకు సాయిరెడ్డి రూపంలో శనిపట్టిందని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా మేయర్ అభ్యర్ధిగా పీలా శ్రీనివాసరావుని ఎంపిక చేశామని, ఆయనను గెలి పించాలని కోరారు. 25 మంది ఎంపీలనిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ప్ర ధాని మెడ వొంచి మరీ తెస్తానన్న జగన్ రెడ్డి, మోడీ ముందు మెడ దించేసుకుని జారుకున్నా డంటూ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి తండ్రి కంటే ముందు తానే ముఖ్యమంత్రిని అయ్యానని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఎంతో అభివృద్ధిని ఇచ్చానని చెప్పారు. విశాఖ ప్రశాంత తను జగన్, సాయిరెడ్డి విధ్వంసం చేస్తున్నారని చెబు తూ హుదూద్ సమ యంలో కేవలం పది రోజుల్లోనే మా మూలు స్థితికి తెచ్చే వరకూ తాను ఇక్క డే ఉండి మామూలు స్థితి తెచ్చానని చెప్పా రు. అందుకె టపాలు లేని దీపావళి జరుపుకో వాలంటే, గౌరవించి పాటించారని, రాష్ట్రమం తటా వేరేగా నిర్ణయిం చినా విశాఖ మాత్రం నాపై ప్రేమను చాటు కుని ప్రధానమైన నాలుగు నియోజక వర్గా ల్లోనూ తెలుగు దేశం పార్టీని గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధి పీలా శ్రీనివాసరావుని మేయర్గా గెలిపించాలని, ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి అందుకోవాలన్నారు. గ్యాస్ లీకేజీల్లో అయిదే వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయని, టిడిపికి మేయర్గా అవకావం కల్పిస్తే న్యాయం చేస్తా మన్నారు.కాగా,
స్టీల్ ప్లాంట్ పోస్కోకు ఇచ్చేయడానికి లోపాయికారి ఒప్పందం చేసేసుకున్న జగన్ రెడ్డి, సాయిరెడ్డి విశాఖ ప్రజలను మోసగిస్తూ పాద యాత్రలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ గర్హించారు. తన హయాంలో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ని ఒప్పించి ఉక్కు పరిశ్ర మని కాపాడితే, ఈ ప్రబుద్ధులు అమ్మేయడానికి సిద్ధమై పోయారన్నారు. 22 నెలలుగా విశాఖలో శని తిష్టవేసిందని, ఏ2కు ఇక్కడ పనేంటని విజయసాయిరెడ్డి గురించి ప్రశ్నించారు. ఆయన పెత్తనం విశాఖలో ఏంటని ప్రశ్నిస్తూ అదానీ డేటా, లూలూ షాపింగ్ , వంటి అనేక ప్రాజక్టులను తరిమేసారని విమర్శించారు. భూ కబ్జాలు, బెది రింపులు, పోలీసు కేసులతొ ప్రజలను భయపెడుతున్న జగన్ రెడ్డి, సా యిరెడ్డి మంచి పనులు చేసి ఓట్లు అడగాలని , బెదిరించి కాదన్నారు. ఓట్లెయ్యకపోతే ఫించన్లు ఇవ్వమని, రేషన్ ఇవ్వమని పోలీసు కేసులు పెడతామనడం దర్మమా అ న్నారు.గ్రేటర్ ఎన్నికల్లో వైకాపాను ఓడించి తెదేపాకు పట్టం కట్టాలని ఈ సదర్భంగా చంద్ర బాబు నాయు డు కోరారు. విశాఖ భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసు కోవాల న్నారు. ఈ ప్రచారంలో పార్టీ రాష్ట్ర అధ్య క్షులు కింజా రపు అచ్చెన్నాయుడు, మేయర్ అభ్యర్ధి పీలా శ్రీనివా సరావు, ఎమ్మె ల్యేలు గణబాబు , విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో తేల్చుకోండి… గాజువాక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు..
Advertisement
తాజా వార్తలు
Advertisement