Tuesday, October 29, 2024

Bomb Threat |ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు..

దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. కేంద్రం కఠిన చర్యలుంటాయని హెచ్చరించినా, భద్రతా సంస్థలు విస్తృత దర్యాప్తు చేస్తున్నా ఏదో ఓ విమానానికి హెచ్చరిక మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. విశాఖ ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

చెన్నై – విశాఖ, బెంగళూరు – విశాఖ మధ్య సర్వీసులు నిర్వహించే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విమానాల్లో బాంబులు అమర్చినట్లు సందేశం రావడంతో అప్రమత్తమైన ఎయిర్ లైన్స్ అధికారులు… ఎయిర్పోర్ట్ లో విమానాన్ని నిలిపివేసి… భద్రతా సిబ్బందితో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు.

కాగా, గ‌త 15 రోజుల్లో దేశ‌వ్యాత్తంగా 200కు పైగా విమానాల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement