Saturday, November 23, 2024

జ‌న‌సేన – బిజెపిల మ‌ధ్య పొత్తు లేన‌ట్లే – మాధ‌వ్..

విశాఖ‌ప‌ట్నం – ఎపిలో జ‌న‌సేన – బిజెపి మ‌ధ్య పొత్తు ఉన్నా లేన‌ట్లుగానే కొన‌సాగుతున్న‌ద‌ని బిజెపి మాజీ ఎమ్మెల్సీ మాధ‌వ్ వ్యాఖ్యానించారు.. ఇటీవ‌ల తాను ఎమ్మెల్సీగా బ‌రిలోకి దిగిన సంద‌ర్బంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను స్వ‌యంగా క‌లిసి మ‌ద్ద‌తు కోరినా ఆయ‌న నుంచి స్పంద‌న క‌నిపించ‌లేద‌ని వాపోయారు.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త‌మ‌తో కలిసి రావడం లేద‌ని అన్నారు..జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా పంపిందని, దాంతో ఏపీ బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్మారని మాధవ్ వివరించారు. దీనివ‌ల్ల తాను ఓట‌మిపాల‌య్యాని పేర్కొన్నారు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఆకర్షించడంలో టిడిపి విజ‌యం సాధించింద‌ని మాధ‌వ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement