అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఎపిలో బంద్ నేటి ఉదయం ప్రారంభమైంది . ఈ బంద్‌కు బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బంద్ ప్రభావంతో విశాఖపట్నంలో అర్బన్ సిటీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. విజయవాడ నెహ్రూ బస్‌స్టేషన్ ఎదుట రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్, టీఎన్‌టీయూసీ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు సైతం నిరసనలో పాల్గొన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బంద్‌తో అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. బంద్‌కు లారీ యాజమాన్య సంఘాలు మద్దతు ప్రకటించారు. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటి వరకు బస్సులు డిపోలకే పరిమితంకానున్నాయి. విశాఖ మద్దెలపాలెం బస్ డిపో వద్ద వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement