ఏపీలో మరోసారి వాలంటీర్ పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. వాలంటీర్ల పోస్టులతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. తాజాగా విశాఖ జిల్లాలో 337 గ్రామ/వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువడగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 14లోగా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. విద్యార్హత 10th పాస్. ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి. తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. వయస్సు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. వివరాలకు https://apgv.apcfss.in/ చూడండి. కాగా అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.
పోస్టుల వివరాలు: మామిడివాడ, మాడుగుల, వద్రపల్లి, చక్కపల్లి, లింగాపురం, కొత్తపల్లి, అచ్యుతాపురం, గండవరం, రెడ్డిపల్లి తదితర పంచాయతీల్లో మూడు చొప్పున ఖాళీలు ఉన్నాయి. పెదగుమ్మలూరు, సత్యనారాయణపురం, పలమామిడి, తల్లవలస, రాచపల్లి పంచాయతీల్లో నాలుగు చొప్పున ఖాళీలు ఉన్నాయి. కొర్రాయి, పంద్రంగిలో ఐదు చొప్పున, చోడవరంలో 25, కశింకోటలో 11 ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతర గ్రామాల్లో ఒకటి లేదా రెండు చొప్పున ఖాళీలు ఉన్నాయి.