Saturday, November 16, 2024

అనకాపల్లి హైవేపై కూలిన ఫ్లైఓవర్ పిల్లర్, ఇద్దరు మృతి

అనకాపల్లి జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్పకూలింది. అదే సమయంలో ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న ఒక కారు, లారీ కూలిన పిల్లర్ కింద చిక్కుకుని ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. సంఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement