Wednesday, November 20, 2024

ప్రేమిస్తోందని కూతురిని చంపిన తండ్రి

విశాఖ ప‌ట్ట‌ణంలోని రెల్లివీధిలో సొంత బిడ్డ‌ను తండ్రి అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేశాడు. రెల్లి వీధికి చెందిన వ‌డ్డాది ప్ర‌సాద్ అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న కూతురు ఓ అబ్బాయితో ఆమె ప్రేమ‌లో ప‌డింది. ఆ అబ్బాయికి కొద్ది రోజుల క్రిత‌మే పెల్లి జ‌రిగింది. అయితే పెద్ద కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుంది.. ఇప్పుడు రెండో కూతురు కూడా ప్రేమ‌లో ప‌డ‌డంతో తండ్రి ఆగ్ర‌హంతో ఉన్నాడు. నిన్న ప్ర‌సాద్ త‌ల్లి చ‌నిపోయిన రోజు కావ‌డంతో.. రెండో కూతురిని ఇంటికి పిలిపించాడు. ఆ త‌ర్వాత ఆమెను అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. అనంత‌రం త‌న కూతురిని తానే చంపిన‌ట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు ప్ర‌సాద్. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని నిందితుడు ప్ర‌సాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement