Friday, November 22, 2024

ఆంధ్ర యూనివ‌ర్శిటీలో క‌రోనా క‌ల్లోల్లం.. 65 మంది ఇంజ‌నీరింగ్ విద్యార్ధుల‌కు పాజిటివ్..

విశాఖపట్నం – ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ క‌ళాశాల‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది… ఇక్క‌డ బోయ్స్ హాస్ట‌ల్లో ఉంటున్న 1500 మంది విద్యార్ధుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 65 మందికి పాజిటివ్ గా నిర్థార‌ణైంది. అలాగే గాళ్స్ హాస్ట‌ల్లోని 500 మంది విద్యార్ధిన‌ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.. ఇందులో 200 మందికి నెగెటివ్ గా తేలింది.. మిగిలిన 300 మంది ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రావ‌ల్సి ఉంది.. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులందరినీ యూనివర్సిటీలోనే కేర్‌ సెంటర్‌లో (హోమ్‌ ఐసోలేషన్‌) వుంచి వైద్యం అందిస్తున్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తి వేగంగా వున్నందున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తరగతులకు హాజరైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించేందుకు అవకాశం లేకపోవడం, ఒకరు తాకిన వస్తువులు మరొకరు తాకడం, భోజనం చేసేటప్పుడు దగ్గర దగ్గరగా కూర్చోవడం…విద్యా సంస్థల్లో వైరస్‌ విజృంభణకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానీ ఆరా..
ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో క‌రోనా కేసులు పెర‌గ‌డంతో ఎపి వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు.. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యానారాయ‌ణ‌తో సెల్ లో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్రతి రోజు 7వేల 5వందలు వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆరు కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. కేజీహెచ్ హాస్పిటల్, అనకాపల్లి, విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు. కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్‌లో 15మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement