విశాఖ: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి జగనే నంటూ మండి పడ్డారు టిడిపి ఎపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే పోస్కో ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారన్నారు. అప్పుడు జగన్ అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ? ప్రశ్నించారు. ఇప్పుడు అఖిల పక్షం అంటూ ప్రధానికి లేఖ రాయడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు..భూములు కాజేయలని ముఖ్యమంత్రి ప్రణాళిక వేసుకోవడంతోనే, విశాఖ స్టీల్ ఫ్లాంట్ ఉద్యమానికి సహాకరించడం లేదని ధ్వజమెత్తారు. దొంగ విజయసాయిరెడ్డి మాటలు నమ్మితే స్టీల్ ఫ్లాంట్‌ను కాపాడుకోలేమని అచ్చెంన్నాయుడు తేల్చేశారు. స్టీల్ ఫ్లాంట్ కోసం పదవులకు పార్టీలకు అతీతంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేరే పార్టీల వాళ్లు రాజీనామా చేసిన చోట తెలుగుదేశం పోటీ చెయ్యదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement