న్యూఢిల్లీ/ విశాఖపట్నం – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వంద శాతం వాటాలు అమ్మివేస్తామని, ఈ విషయాన్ని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు స్పష్టం చేశామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.. లోక్ సభలో వైసిపికి చెందిన గొట్టేటి మాధవి, విశాఖ ఎంపి సత్యనారాయణలు విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, విశాఖ స్టీల్ లో ఎపి ప్రభుత్వానికి ఒక్క పైసా వాటా లేదని, దానిపై సంపూర్ణ అధికారం తమకే ఉందని తేల్చివేశారు.. వంద శాతం వాటాలను అమ్మివేసే విషయంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వంతో చర్చలు జరిపామని తెలిపారు.. అలాగే విశాఖ అమ్మకం విషయంలో అవసరమైనప్పుడు కేంద్రానికి కూడా సహకారం అందించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. షేర్ల కొనుగోలుపై ప్రత్యేక ప్రతిపాదన పెట్టామని.. దీనివల్ల భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తాం – జగన్ కు ఈ విషయం స్పష్టం చేశాం – నిర్మలా సీతారామన్…
Advertisement
తాజా వార్తలు
Advertisement