ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రత్యేక కథనం..
కాపులకు డిప్యూటీ మేయర్
అభిప్రాయాలు స్వీకరించిన విజయసాయి రెడ్డి
సీఎం జగన్‌తో మంతనాలు
విశాఖపట్నం, పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపధ్యంలో జీవీఎంసీ మేయర్ పీఠం కీలకంగా మారింది. ఈ నేపధ్యంలో కీలకమైన ఈ పదవిని ఎవరికి అప్పగించాలన్న అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పటికే స్థానిక నేతలతో సమా లోచనలు జరిపారు. పలువురు అభిప్రాయాలను కూడా సేకరించినట్లు సమాచారం. సోమవారం ఆయన అమరా వతి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయా అంశాలపై చర్చించడం కూడా జరిగినట్లు విశ్వసనీ య సమాచారం. రాత్రికి తిరిగి విజయసాయిరెడ్డి విశాఖ చేరుకు న్నారు. ఈనెల 18న పదవీ ప్రమాణ స్వీకారం లోగా ఈ ప్రక్రి య పూర్తి చేయాల్సి ఉంది. అయితే మేయర్ పీఠానికి సంంబ ధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే తుది నిర్ణయమని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులపై విజయసా యిరెడ్డితో సమాలోచనలు జరిపినట్లు కూడా సమాచారం. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన యాదవ సామాజిక మహిళకు కీలకమైన మేయర్ పీఠాన్ని కేటాయి స్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో 11వ వార్డు నుంచి 4,850 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గొలగాని హరివెంకటకుమారి పేరు పరిశీలన జరుపుతు న్నట్లు సమాచారం. బిఎస్సీ, బిఇడి పూర్తి చేసి ప్రస్తుతం టీచర్‌గా సేవలందిస్తున్న కుమారి పేరును వైసీపీ అధిష్టానం పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారి కుటుం బానికి సంబంధించిన సమాచారం కూడా సేకరించి అన్ని విధాలా ఆలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన అక్కరమాని రోహిణి పేరు కూడా పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక 59వ వార్డు పి.పూర్ణశ్రీ పేరుతో పాటు పురుషులకు కేటాయించినట్లు అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు కూడా పరిగణలోకి తీసు కోవడం జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే అత్యధిక శాతం గొలగాని హరివెంకట కుమారిని మేయర్‌గా నియమిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా విశాఖ తూర్పు నియోజకవర్గానికే మేయర్ పద విని కేటాయించనున్నారు. అందులోనూ యాదవ సామా జిక వర్గం నుంచే పెద్దపీట వేయనున్నారు. ఇక కాపు సామా జిక వర్గం నుంచి కోరుకొండ వెంకటరత్న స్వాతి పేరు కూడా పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక డిప్యూటీ మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి కేటాయించను న్నారు. యాదవ, కాపు సామాజిక వర్గాలకు సమానంగా వార్డులు లభించాయి. దీంతో యాదవ సామాజిక వర్గానికి మేయర్ పదవిని కేటాయించనుండగా కాపు సామాజిక వర్గా నికి డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించనున్నారు. రేసులో జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసుతో పాటు ముమ్మన దేవు డు పేరును కూడా పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తోంది.