విశాఖపట్నం – విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమ నేపథ్యంలో నగర పాలక సంస్థ ఎన్నికలలో వైసిపి జోరును కొనసాగిస్తున్నది.. ఇక్కడ మొత్తం 98 డివిజన్ లు ఉండగా ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాలలో 58 డివిజన్ లలో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది… టిడిపి 30 డివిజన్ లకే పరిమితం కాగా, జనసేన కూటమి నాలుగు డివిజన్ లలో విజయం సాధించింది.. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న డివిజన్ లు రెండింటిని వామపక్ష అభ్యర్ధులు గెలుపొందారు.. ఇతరులు మరో నాలుగు చోట్ల విజయం సాధించారు. ఇక్కడ జనసేన పోటీ చేయడంతో టిడిపి ఓట్లకు భారీగా గండి పండింది.. పలు డివిజన్ లలో వైసిప స్వల్ప తేడాతో విజయం సాధించడం విశేషం..
విశాఖ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం
విశాఖ కార్పొరేషన్ (98): వైఎస్ఆర్సీపీ -58, టీడీపీ -30, జనసేన -3
బీజేపీ -1, సీపీఐ -1, సీపీఎం -1, ఇతరులు -4