Tuesday, November 26, 2024

ముంబైకి వైజాగ్‌ గంజాయి

ఏసీ రైలు బోగీల ద్వారా స్మగ్లింగ్‌
ఇద్దరి అరెస్ట్‌… మరో ఇద్దరు పరార్‌
32 కేజీల గంజాయి స్వాధీనం
వరంగల్‌ -కై-మ్‌, ప్రభన్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతోపాటు ముంబయికి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఎవరికీ అనుమానం రాకుండా రైలులో ఏసీ బోగీల్లో గంజాయిని తర లిస్తున్న ఈ ముఠాలోని సభ్యులను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నాలుగేళ్లుగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరు సభ్యులు అరెస్టు కాగా మరో ఇద్దరు పరార య్యారు. ఈ ముఠానుంచి 32 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్‌ జోషి తెలిపారు. విశాఖ నుంచి ముంబయికి గంజాయి తరలించే ఈ ముఠా అడిగినవారికి అందేలా గుట్టుగా రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తోంది. సాధారణ బోగీల్లో అయితే తరచూ తనిఖీలుంటాయని, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ నాలుగేళ్లుగా వారు ఈ దందా కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగానే శుక్రవారం వరంగల్‌కు చేరుకున్న ఈ ముఠా గంజాయిని సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు రాగా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా, యలమంచిలి మండలం పెద్దగొల్ల పాలెం గ్రామానికి చెందిన ద్వారపూడి మణికుమార్‌ అలియాస్‌ దుర్గా(21), వరంగల్‌ జిల్లా, చెన్నారావుపేట మండలం తోవనగడ్డ తండాకు చెందిబానోత్‌ బిచ్యా( 34)లను అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు నిందితులు… విశాఖపట్టణానికి చెందిన ప్రధాన నిందితుడు గోడి శంకర్‌రావు, ములుగు జిల్లా, మల్లంపల్లికి చెందిన ధరావత్‌ మహేశ్వరీ అలియాస్‌ రేష్మా, పరారీలో ఉన్నారు. విశాఖ జిల్లాలోని డౌనూరు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, రెండేసి కిలోల చొప్పున ప్యాకెట్లను తయారు చేసి ముఠాలోని ముగ్గురు వ్యక్తులకు ఇచ్చి రైలు ద్వారా మహారాష్ట్ర, తెలం గాణలోని ములుగు, నర్సంపేట ప్రాంతాలకు తరలించేవారు. ఖరీదైన బ్యాగుల్లో ప్యాక్‌ చేసి, ఏసీ బోగీల్లో తరలించే వారు. ఈ తరహాలో నిందితులు గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు- టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అం దింది. పక్కా సమాచారం అందడంతో శుక్రవారం కాపుకాశారు. గంజాయి అందజేసేందుకు గాను వరంగల్‌ రైల్వే స్టేషన్‌ బయ టకి వచ్చిన నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద గంజాయి లభ్యం కావడంతో అరెస్టు చేసి ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement