తిరుమల వెళ్లే వీఐపీలకు టీటీడీ కీలక సూచన చేసింది. రేపు దీపావళి పండుగ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయనున్నారు. దీంతో, నేడు ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించడం లేదు.
- Advertisement -