రాష్ట్రవ్యాప్తంగా రేపటి (14వ తేదీ) నుంచి పల్లెపండుగ వారోత్సవాలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కాగా, 13,324 గ్రామాల్లో ఏకకాలంలో పల్లెపండుగ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
ఇక, రేపు (సోమవారం) ఉదయం సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం పల్లెపండుగ వారోత్సవాల సందర్భంగా రూ.4,500 కోట్లతో దాదాపు 30 వేల పనులకు శ్రీకారం చుట్టనుంది. 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల మేర తారురోడ్లు, వ్యవసాయ చెరువులు, పశువుల కొట్టాలు, బోరుబావుల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది.