ప్రస్తుత ఎస్పీ బిందుమాధవ్ కాకినాడకు బదిలీ
కర్నూల్ బ్యూరో, జనవరి 21 (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ నియామకమయ్యారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న బిందు మాధవ్ కాకినాడకు బదిలీ అయ్యారు. కర్నూలు జిల్లా ఎస్పీగా నియమితులైన విక్రాంత్ పాటిల్ 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన వివిధ పదవుల్లో పనిచేశారు.
గతంలో ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. విజయనగరంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్)గా పనిచేశారు. విజయవాడ సిటీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. కాకినాడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. కర్నూలు జిల్లాకు బదిలీ కావడం గమనార్హం.
ఏపీఎస్పీ కమాండెంట్ గా ఆయన సతీమణి…
ఇక .. కర్నూలు జిల్లా ఎస్పీగా నియమితులైన విక్రాంత్ పాటిల్ సతీమణి దీపిక కర్నూలు జిల్లా ఏపీఎస్పీ కమాండెంట్ గా నియమితులు కావడం విశేషం. విక్రాంత్ సొంత రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం.