Saturday, November 23, 2024

Vijayawada – వ‌ర‌ద బాధితుడి చెంప చెళ్…. వీఆర్వో స‌స్పెండ్…

విజ‌య‌వాడ – వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది.

ఆ అధికారి ఓ వ్యక్తిని చెంపపై కొట్టడాన్ని అక్కడున్న కొందరిలో వీడియో తీశారు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. స్థానికులపై దుర్భాషలాడుతూ ప్రవర్తించింది. అంతేకాకుండా.. తన భర్తను తీసుకొచ్చి బెదిరిస్తుందని ఆరోపించారు. అక్కడున్న పోలీసులు ఏమీ పట్టించుకోకుండా.. వీఆర్వోకే సపోర్ట్ చేస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని.. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

వీఆర్వో ‘

వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తూ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అదేశాలు జారీ చేశారు.. వీఆర్వో జయలక్ష్మీకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు క‌లెక్ట‌ర్. బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు సూచనలు ఇచ్చార‌ని, బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పాలని అదేశాలున్నాయ‌న్నారు.. సీఎం స్వయంగా ఆదేశిస్తున్నా మారని కొందరి ఉద్యోగుల తీరు మార‌డం లేద‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. తీరు మారని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామ‌ని హెచ్చ‌రించారు క‌లెక్ట‌ర్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement