Sunday, November 17, 2024

Diarrhea – విజయవాడలో మృత్యు ఘోష … క‌లుషిత నీరు తాగి తొమ్మిది మంది మృతి..

విజయవాడ: నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. నేడు మ‌రోక‌రు మ‌ర‌ణించ‌డంతో అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మొగల్రాజుపురంలో గల్లా కోటేశ్వరరావు(60) వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. ఇప్పటికే డయేరియా లక్షణాలతో మొగల్రాజపురం, పాయకాపురంలో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో విజయవాడ నగరంలో గత ఐదు రోజుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు.

ఒక్క మొగల్రాజపురంలోనే ఇప్పటివరకు ఆరుగురు విరేచనాలతో మృతి చెందారు. పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో వారం వ్యవధిలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంత తీవ్రత ఉన్నా.. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు పెట్టలేదు. మొగల్రాజపురంలోని సీపీఎం కార్యాలయంలో ఆరు పడకలను ఏర్పాటుచేసి వారి సౌజన్యంతో చికిత్స అందిస్తోంది. దాదాపు 250 మంది రక్తనమూనాలు సేకరించి ప‌రీక్ష‌ల‌కు పంపారు.. ఫ‌లితాల కోసం వైద్య‌లు ఎదురు చూస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement