ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోగత 14 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడకు ఏం చేశారో చెప్పే ధైర్యం, దమ్ము తెదేపా నేతలకు ఉందా అని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ లు ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో గుడులు కూల్చడం, దొరికిందంతా దోచుకోవడమే జరిగిందన్నారు. సంక్షేమం అంటే ఇలా ఉంటుందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5% నెరవేర్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు. టిడిపి, జనసేన కలిసిన ప్రజలంతా వైసిపి వైపే ఉన్నారని చెప్పారు.
విజయవాడలోని భవానిపురం లోనీ స్వాతి రోడ్డు లో 15 అడుగుల వైఎస్ కాంస్య విగ్రహాన్ని మంత్రులు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ వైయస్ విగ్రహాలను తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు చిత్తుగా ఓడించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న ఓడిపోయేలా ప్రజలు ఓటు వేయాలన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 99.5% హామీలు నెరవేర్చిన ఘనత దేశంలో ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు నా ఊరు అని చెప్పుకునే వాళ్లంతా విజయవాడకు ఏం చేశారు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు జన్మభూమి కమిటీల పెట్టి కావాల్సిన వారికే అన్ని దోచి పెట్టేలా చేశారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చారన్నారు మీ పట్టణం అనే చెప్పుకునే విజయవాడలో 14 ఏళ్లుగా ఏం చేశారు నిరూపించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ జగన్ భయపెట్టాడు కనకే మీడియా ముందు లొకేషన్ పెడుతున్నాడని తెలిపారు. అవినీతి చేసినందునే చంద్రబాబు 50 రోజులపాటు జైల్లో ఉన్నాడని చెప్పారు. వంగవీటి మోహనరంగా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబుని విమర్శించాడు. పోటీ చేసే ధైర్యం లేక పార్టీను అద్దెకు అప్పజెప్పాడని పవన్ పై విమర్శించారు. రాష్ట్రంలో సంపదంత చంద్రబాబు ఆయన కొడుకు తిని రోడ్లు వేయలేదు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రాహుల్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్లు తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.