Sunday, November 24, 2024

Vijayawada – డ్రోన్ల‌ నిఘాతో శాండ్ మాఫియాకు చెక్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో:ఇసుకాసురులకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అడ్డుకట్టకు సర్వసన్నద్ధమయ్యారు. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కృష్ణానదిలో అక్రమంగా ఇసుకను తోడి.. నిల్వ చేసి హైదరాబాద్కు తరలిస్తున్న ఇసుక మాఫియా ఆగడాలకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజ‌శేఖర బాబు బ్రేక్ వేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. డ్రోన్ లతో పహారా కు రంగం సిద్ధం చేశారు. ఇసుక క్వారీలు, ఇసుక డంప్లు, అక్రమ రవాణ ట్రిప్పర్లపై నిఘా పెంచారు.

క్షణ క్షణం ఈ అక్రమాలపై కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచి తనిఖీ చేస్తూ.. అధికారులను అలెర్ట్ చేసే పనిని ప్రారంభించారు. 17 చెక్‌పోస్టుల ఏర్పాటు..రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న ఉచిత ఇసుకను సామాన్య ప్రజలకు అందకుండా దళారులు అక్రమంగా దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు.

అక్రమ ఇసుక రవాణ నియంత్రణపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్. బి, లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బందితో పలు ప్రత్యేక బృందాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు నియమించారు. 17 చెక్ పోస్ట్ లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ బృందాలతో పాటు సాంకేతికత పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్ కెమెరాలతో పహారాకు రంగం సిద్ధం చేశారు.

సీసీ కెమెరాల‌తో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌..స్టాక్ యార్డులు, చెక్ పోస్ట్ ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. టిప్పర్ల జీపీఎస్ లను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందిస్తారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడా అక్రమంగా ఇసుక నిల్వలు లేకుండా , అక్రమ రవాణ జరగని రీతిలో అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు.

- Advertisement -

అనదికారిక ఇసుక డంప్ లను నిల్వ చేసినా, అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాజ శేఖర బాబు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement