Wednesday, December 18, 2024

AP | జీరో క్రైమ్ సిటీగా విజయవాడ : ఎంపీ కేశినేని

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : ప్రపంచ నగరాలలో అగ్రగామిగా నిలవనున్న అమరావతికి అతి ముఖ్యమైన విజయవాడను జీరో క్రైమ్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ విజ్ఞప్తి చేశారు. నేటి పోటీ ప్రపంచంలో డ్రోన్ల వినియోగం విరివిగా పెరిగింది అన్న ఆయన అన్ని ప్రాంతాలలో అన్ని రంగాలలో డ్రోన్ వినియోగం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

బి ఎం సి లో కూడా డ్రోన్ల వినియోగం పెంచి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. గత వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఎంతో వెనుకబడిందన్న ఆయన 2047 విజన్ ఫలాలు భవిష్యత్తు తరాలు అందుకొనున్నాయని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన క్లౌడ్ ప్రోటల్ ఫర్ సేఫ్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

నగరంలోని ఏఆర్ గ్రౌండ్స్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్లకు డ్రోన్లను విరాళంగా అందజేశారు. వీరితో పాటు ఎంపీ చిన్ని 10 డ్రోన్లను అందించగా, మరో 14 డ్రోన్లను పలువురు దాతలు అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ…. దేశంలోనే ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు ఒక మైలు రాయిగా నిలబడబోయే క్లౌడ్ పెట్రోలింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ముందుకు రావడం జరుగుతుందన్నారు.

పోలిసింగ్ లో లైవ్ డ్రోన్ ట్రాఫిక్ సర్వేలన్స్, క్రైమ్ సీన్ సర్వేలన్స్, అల్లర్లు చేసేవారిని చేధర గొట్టడానికి డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ఉపయోగించవచ్చుని, వనరబుల్ ప్రదేశాలను గుర్తించడం జరిగిందని, ఆ ప్రదేశాల మ్యాపింగ్ లను డ్రోన్ లకు అనుసంధానం చేయడం ద్వారా అవే ట్రాక్ చేసుకుంటూ ఆయా ప్రదేశాలకు తిరిగి అక్కడి సమాచారాన్ని ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుండి వీక్షించవచ్చు అన్నారు.

ఇన్ విజిబుల్ పోలిసింగ్ ఇన్ విజిబుల్ పోలిసింగ్ అని, పోలీసులు కనిపించకపోయినా పోలిసింగ్ కనిపించాలని, దీని ద్వారా తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ ప్రదేశాలలో పోలిసింగ్ నిర్వహించ వచ్చు అని తెలియజేశారు. ఏం.పి. శ్రీ కెసినేని శివనాధ్ 10 డ్రోన్ లను పోలీస్ శాఖకు ఇవ్వడం మరి కొంతమంది దాతలు మరో 15 డ్రోన్ లను ఇచ్చి సహకరించడం ఎంతో సంతోషం గా ఉందన్నారు.

500 మంది మహిళా సచివాలయ పోలీసులకు అంధరికి డ్రోన్ పైలైటింగ్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ క్రమంలో ఇప్పటికీ 100 మంధికి మహిళా పోలీసులకు డ్రోన్ పైలైటింగ్ పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

ఎం.పి కెసినేని శివనాధ్ మాట్లాడుతూ.. నగరం అమరావతి రాజధానిలో ఒక భాగం గా ఉందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో విజయవాడ వెనుకబడిందన్నారు. యన్టీఆర్ జిల్లాలో డైనమిక్ లాంటి అధికారులు అన్నారని, మగవారికి ధీటుగా మహిళలు ఉంటారని అనడానికి డ్రోన్ పై లెట్స్ అయిన మహిళా పోలీసులే ఆదర్శం అని తెలిపారు.

అప్పా, గ్రౌండ్స్, సిసి లైట్స్ కు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. డ్రోన్ షో ప్రపంచంలోనే నిలిచిపోయిందని,నగర పోలీసు కమిషనర్ నగరాన్ని డ్రోన్ నగరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మున్సిపల్ కమీషనర్ కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అధికారులకు ప్రజాప్రతినిధుల సహకారం పూర్తిగా ఉంటుందని, విజన్ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి అందరం సహకరిద్దామని తెలిపారు. చంద్రబాబు విజన్ 2020 లో ఫలాలు అందుకున్న లక్షమండిలో నేను ఒకడినని, జీరో క్రైమ్ సిటీగా విజయవాడ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంధర్భంగా మహిళా పోలీసుల ద్వారా డ్రోన్ లను ఫ్లై చేయించడం జరిగింది.

అనంతరం పోలీసు కమిషనర్ ఎం.పి. చేతుల మీధుగా ప్రతి పోలీసు స్టేషన్ కు ఒక డ్రోన్ చొప్పున 28 పోలీసు స్టేషన్ లకు అంధించడం జరిగింధి. డ్రోన్ లను ఇచ్చిన దాతలు ఎం.పి. శ్రీ కెసినేని శివనాధ్ 10 డ్రోన్ లను,కుదరవెల్లి వెంకట నరసయ్య 2 డ్రోన్ లన,కె.పవన్ కుమార్ 1 డ్రోన్ ను,వత్సవాయి నుండి రాజ1 డ్రోన్ ను, జగ్గయ్య పేట నుండి మరో ముగ్గురు మూడు డ్రోన్ లను మిగిలిన 10 డ్రోన్ లను కొందరు దాతలు ఇచ్చినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement