దేశంలో పెరిగిన వంటగ్యాస్ ధరలపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. వంట గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. రెండు వారాల్లోనే రెండోసారి సబ్సిడీ సిలిండర్లపై రూ.25, కమర్షియల్ సిలిండర్లపై రూ.75 పెంచి ప్రజలపై పెను భారం మోపిందని దుయ్యబట్టారు. అసలే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉపాధి, వ్యాపారాలు కుంటుబడితో ఈ సమయంలో ధరలు పెంచడం ప్రజలను కష్టాల్లోకి నెడుతుందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ ధరల పెంపుపై కేంద్రం పునరాలోచన చేయాలి… పక్షం రోజుల్లోనే రెండోసారి సబ్సిడీ సిలిండర్లపై రూ. 25, కమర్షియల్ సిలిండర్లపై రూ.75 పెంచి పెను భారం మోపింది.. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉపాధి, వ్యాపారాలు కుంటుబడ్డాయి..ఈ టైములో ధరలు పెంచడం ప్రజానీకాన్ని కష్టాల్లోకి నెడుతుంది’ అని ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement