వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో ఆయన హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. కేసు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు.
- Advertisement -