ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం నీరబ్ కుమార్ ఈరోజు (మంగళవారం) పదవీవిరమణ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులతో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయి ప్రసాద్, యం.టి.కృష్ణబాబు, టిటిడి ఈఓ శ్యామలరావు, జిఎడి కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే, జయలక్ష్మి, కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు, ఇతర అధికారులు సిఎస్ కి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.