Saturday, November 23, 2024

ఆధార్ కేంద్రాలకు పోటెత్తిన మహిళ లోకం.. కరోనా రూల్స్ బ్రేక్!

కరోనా వేళ నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ కోసం బారులు తీరన మహిళలు ఇప్పుడు ఆధార్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికే ఆ క్యూ లైన్లు కట్టారు. ఎక్కడ వెనుకబడిపోతామో అని నిద్రాహారాలు మానేసి క్యూ కడుతున్నారు. ఏపీలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటేనే నగదు జమ అవుతోంది. అదేసమయంలో ఫోన్‌ నెంబర్‌ను కూడా ప్రమాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చేయూత పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం కింద బీసీ వర్గానికి చెందిన మహిళలకు రూ.15వేల బ్యాంకులో జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తుతో పాటు ఆధార్‌ ని కూడా జతచేయాలన్న నిబంధన విధించింది. దీంతో మహిళలు ఆధార్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆధార్ కేంద్రాల వద్ద భారీగా రద్దీ నెలకొంది.

విజయనగరంలోని ఆధార కేంద్రాలకు మహిళలు భారీగా తరలి వస్తున్నారు. ఒక్కో ఆధార్ నమోదు కేంద్రానికి 500 మంది పైనే మహిళు వస్తున్నారు. ఒకే చోట పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా ఉండటంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement