విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఫేస్ బుక్ ఖాతాను హ్యాకింగ్ గురైంది… దీనిని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, పలువురికి డబ్బులు పంపమంటూ మెసేజ్ లు పెట్టి భారీగా నగదును గుంజేశారు.. వివరాల్లోకి వెళితే, కొంతకాలం క్రితం ఆయన ఖాతాను హ్యాక్ చేసిన నేరగాళ్లు, వందలమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టారు. కలెక్టర్ కదా అన్న ఆలోచనతో వారంతా స్నేహితునిగా అంగీకరించిన తరువాత అసలు ప్లాన్ కు తెరలేపారు. ఒక్కొక్కరికీ మెసేజ్ లు పెడుతూ, తన స్నేహితుడికి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా డబ్బు వేయాలని కోరారు. ఆపై మరుసటి రోజు తిరిగి పంపిస్తానని మెసేజ్ లు చేసేవారు. రూ. 10 వేలు, రూ. 15 వేలు, రూ. 20 వేలు.. చొప్పున పంపమంటూ మెసేజ్ లు వెళ్లాయి. దీంతో కొందరు చెప్పినట్లుగానే నగదును ఖాతాలోకి బదిలీ చేశారు…మరికొందరికి అనుమానం వచ్చిన కొందరు కలెక్టర్ కు ఫోన్ చేసి అడుగగా, అప్పుడే ఆయనకు విషయం తెలిసింది. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, తన పేరిట ఎవరైనా డబ్బు అడిగితే స్పందించ వద్దని కోరారు. తన ఫేస్ బుక్ ఖాతాను ప్రస్తుతానికి మూసివేశానని తెలిపారుఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
విజయనగరం కలెక్టర్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ – స్నేహితుల నుంచి లక్షల్లో స్వాహా…
Advertisement
తాజా వార్తలు
Advertisement